. . . మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సైనికులు మన గురించి వారి కుటుంబాలను వదిలి దేశ సరిహద్దులు కాపలా కాస్తుంటే, రైతులు మానవాళి ఆకలిని తీర్చి ఆరుగాలం కష్టం చేసి శ్రమించి మనకు ఆహారాన్ని అందిస్తున్నారని, దేశానికి సేవ చేసే వీరిని గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని ముక్క దేవేందర్ గుప్తా అన్నారు. మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ప్రత్యేక పాఠశాలలో టిఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జై జవాన్ జై కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశ సైన్యంలో పని చేసిన మాజీ సైనికులు గూడా శ్రీనివాసరెడ్డి, షేక్ మహమ్మద్, అదే విధంగా రైతులు ఎం.వెంకట్ రెడ్డి, మద్దిపూడి చక్రవర్తి లను ఘనంగా సన్మానించారు. స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా, మాయావర్ రాజేశ్వర్, డాక్టర్ ముక్క వినోద్ గుప్త హాజరయ్యారు. ఈ సందర్భంగా టిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ తాటి వీరేశం మాట్లాడుతూ ఇంత వరకు 85 మంది సైనికులను, రైతులను సన్మానించామని, అతి త్వరలోనే 100 మందిని సన్మానించి ఒక మహా సభ ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాటి సుధాకర్ గుప్తా, కే.నరసింహారావు, టి.జితేందర్ రెడ్డి, చల్ల గంగాధర్, స్నేహ సోసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, స్నేహ సొసైటీ రాజశేఖర్, తదితరులు హాజరయ్యారు.