- విద్యార్థి నాయకుల అరెస్టులను ఖండించిన కంచర్ల రవి గౌడ్
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ:హైకోర్టు తీర్పును అమలు చేయవలసిందిగా గురువారం విద్యార్థి నాయకులందరూ ఆందోళన చేస్తే వాళ్లను పోలీసులచే అరెస్ట్ చేయించడాన్ని తీవ్రంగా ఖండించిన బిఆర్ఎస్ నాయకులు కంచర్ల రవి గౌడ్. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలను హైకోర్టు తీర్పు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేయాలని అలాగే నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు.ఎన్ని అరెస్టులు చేసినా బిఆర్ఎస్ పార్టీ పక్షాన బరాబర్ నిరుద్యోగులకు అండగా నిలబడదమని తెలిపారు. అరెస్టులకు కేసులకు భయపడే ప్రసక్తే లేదని,నిరుద్యోగులకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో అండగా నిలబడదామని వారు అన్నారు.అలాగే బీసీలను మోసం చేసే చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీదేనని, ఆనాడు ఎలక్షన్ లలో హామీలు అప్పటి పిసిసి అధ్యక్షులు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు సబ్ ప్లాన్ ఎన్నో హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. రాజకీయంగా గాని ఆర్థికంగా గాని ఉద్యోగంగా రిజర్వేషన్ చేస్తామని కామారెడ్డి సభ సాక్షిగా చెప్పడం జరిగిందని, కానీ చేతల్లో పూర్తిగా విఫలమైనదని తెలిపారు.మొన్న రాష్ట్ర క్యాబినెట్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరు ఢిల్లీ లో ధర్నా చేయడం జరిగిందన్నారు.ధర్నా చేసి ఢిల్లీలో ఏం సాధించారని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. మళ్లీ ఇప్పుడు కామారెడ్డిలో బీసీ మీటింగ్ పెడదామని చెప్పడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. బీసీలకు ఏముద్ధరించారని,మళ్లీ కామారెడ్డి సభ సూటిగా బీసీ రిజర్వేషన్ అమలు చేసి ఏటా 20 కోట్లు కేటాయిస్తామని చెప్పారని అన్నారు. అలాగే బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, లేనియెడల ప్రధాన ప్రతిపక్షం ప్రజల పక్షాన నిలబడి కేటీఆర్ నాయకత్వంలో కొట్లాడుతామని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ కే అఫ్రోజ్,కోడం వెంకటేష్,వేముల శ్రీకాంత్, మాలోత్ రాకేష్ నాయక్,లింగంపల్లి అభి, అందె సుదర్శన్, శ్రీకాంత్, హరీష్, జగన్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
