29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

హై కోర్టు స్టే ఆర్డర్ ఉందంటూ తప్పుడు ప్రచారం

Must read

📰 Generate e-Paper Clip

. లక్ష్మీకాలువ స్థలం కబ్జాను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు

. కబ్జాదారుకు కొమ్ముకాస్తున్నారు

. బీజేవైఎం రాష్ట్ర  ఉపాధ్యక్షుడు సంతోష్ కుమార్

ముప్కాల్, బతుకమ్మ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్ష్మీకాలువ స్థలాన్ని కబ్జా చేసిన మాజీ సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్ పై హై కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని,  సదరు వ్యక్తిపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని బీజేవైఎం రాష్ట్ర  ఉపాధ్యక్షుడు సంతోష్ కుమార్ అన్నారు. ముప్కాల్ మండల కేందరంలోని తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వే నంబర్ 70/1, 70/2, 70/3 లోని లక్ష్మీకాలువ కు చెందిన 400 గజాల స్థలాన్ని కబ్జా చేసి ఇతరులకు కిరాయికి ఇచ్చాడని అన్నారు. ఇరిగేషన్ స్థలంలోని వ్యాపార దుకాణాలను తొలగించాలని  నీటి పారుదల ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మాజీ సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నట్లు అబద్ధం ప్రచారం చేస్తున్నారని అన్నారు.  దీనిపై తాను ఇరిగేషన్ అధికారులకు, తహసీల్దార్ కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.  కొమ్ముల శ్రీనివాస్ ఆక్రమించుకున్న కెనాల్ బౌండరీ సర్వే నంబర్  ను మరోచోట ఉన్న 57/3 సర్వే నంబర్ ను చూపిస్తూ కోర్టును తప్పుదోవ పట్టించాడన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సదరు  కబ్జాదారులు కొమ్ముల శ్రీనివాస్ కు పూర్తిగా సహకారాన్ని అందించారని ఆరోపించారు. అప్పటికప్పుడు కోర్టు లో  దాదాపు రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఖర్చు చేసి లంచ్ మోషన్ వేయగా, కూల్చివేతను ఆపాలని ఆర్డర్ రాలేదని తెలిపారు. నూతనంగా నిర్మించిన మణికంఠ ఏసీ గార్డెన్ కు రోడ్ కి పర్మిషన్ ఇవ్వలేదని, ఆ గార్డెన్ కు సరైన రోడ్డు మార్గం లేదని, గార్డెన్ నుంచి బయటకు వెళ్లే డ్రైనేజీ ని లక్ష్మీ కాలువకు పైపు లైన్ ద్వారా కలపడం ఇలాంటి ఆధారాలను తాను అధికారులకు సమర్పించినట్లు తెలిపారు. ఇకనైనా  ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కబ్జాదారుకు వత్తాసు పలకడం మానుకోవాలని హితవు పలికారు.

False propaganda that the High Court has a stay order

More articles

Latest article