- కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్
భీమ్ గల్, బతుకమ్మ : సిద్దిపేట లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పుస్తకాల పోటీల్లో కవి తొగర్ల సురేష్ రాసిన వెన్నెల్లోమా పల్లె అనే పుస్తకానికి పెందోట సాహితీ పురస్కారం లభించడం హర్షనీయమని కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్దిపేటలో శ్రీవాణి సాహిత్య పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. నిర్వాహకులు పెందోట వెంకటేశ్వర్లు, ప్రముఖ బాలసాహితీవేత్త గరిపెల్లి అశోక్, క్రియాశీల కార్యవర్గ సభ్యులు కలిసి ఈ కార్యక్రమాన్ని స్థానిక సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసి తొగర్ల కు ఈ పురస్కారాన్ని అందజేశారన్నారు. ఈ సందర్బంగా తొగర్ల సురేష్ ను శాలువాతో ఘనంగా సత్కరించి, ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికను, నగదు సంభావణను అందజేశారన్నారు.ఈ వెన్నెల్లో మా పల్లె పుస్తకానికి పెందోట పురస్కారం లభించడం పట్ల ప్రముఖ కవులు తిరుమల శ్రీనివాస్ ఆర్య, మద్దుకూరి సాయిబాబు, స్వర్ణ సమత, దారం గంగాధర్, డాక్టర్ బోచ్కర్ ఓం ప్రకాశ్, లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ చైర్మన్, ప్రముఖ సామాజిక సేవకుడు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు చాకులింగం, సీనియర్ జర్నలిస్టు, బాల్కొండ చరిత్ర గ్రంథ రచయిత బ్రహ్మరౌతు నర్సింగ్ రావు తదితరులు తొగర్ల సురేశ్ ను అభినందించారు.
