కవి తొగర్లకు సాహితీ పురస్కారం ఇవ్వడం హర్షనీయం
కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ భీమ్ గల్, బతుకమ్మ : సిద్దిపేట లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పుస్తకాల పోటీల్లో కవి తొగర్ల సురేష్ రాసిన వెన్నెల్లోమా పల్లె అనే పుస్తకానికి పెందోట సాహితీ పురస్కారం లభించడం హర్షనీయమని కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్దిపేటలో శ్రీవాణి సాహిత్య పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. నిర్వాహకులు పెందోట వెంకటేశ్వర్లు, ప్రముఖ బాలసాహితీవేత్త గరిపెల్లి అశోక్, క్రియాశీల కార్యవర్గ సభ్యులు కలిసి ఈ...