29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

నూతన రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

Must read

📰 Generate e-Paper Clip

  • రూరల్ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం
  • రెండో విడతలో స్థలం లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం
  • నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

 

డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో ఇచ్చిన మాట తప్పకుండా అన్ని సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని, నిరుపేదల కలలను నెరవేస్తున్నారని  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి  అన్నారు. డిచ్పల్లి  మండల కేంద్రంలోని  కేఎన్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన  నూతన రేషన్ కార్డుల పంపిణీ  కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  రాష్ట్రంలో ఈనెల 14న సీఎం రేవంత్ రెడ్డి నూతన రేషన్ కార్డును పంపిణీ ప్రారంభించారని, ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలకు కావలసిన ప్రతి సంక్షేమం  పథకలను కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తోందని అన్నారు. మన జిల్లాలో 63,500 కొత్త కార్డులు, రూరల్ నియోజకవర్గంలో  నూతన రేషన్ కార్డులు  16,116 మంజూరు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో నిరుపేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని, కెసిఆర్ మనుమడు ఎ బియ్యం  తింటున్నాడో పేదలకు కూడా సన్న బియ్యం ఇస్తామని కెసిఆర్ చెప్పిన మాటలు  అన్ని అబద్ధాలు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలకు, విద్యార్థులకు సన్నబియ్యం ఇస్తుందని ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇయ్యాలని, ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎక్కడ  ఇవ్వలేదని విమర్శించారు. రూరల్  నిజామాబాద్ నియోజకవర్గంలో సుమారు 22 వేల ఇండ్లు అవసరం ఉన్నదని వాటన్నింటినీ కట్టించే బాధ్యత నాదని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. రెండో విడతలు ఇళ్లస్థలం లేనివారికి 75 గజాల  స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. దేశంలోనే  పేదలకు సన్నబియ్యం  ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది, కాంగ్రెస్ పార్టీదని అన్నారు, రైతు భరోసా ,బోనస్  వంటి సంక్షేమ పథకాల ద్వారా   రైతులను రాజు చేయడమే  కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం అని అన్నారు. బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో ఎక్కడ కూడా సన్న బియ్యం  పేదలకు ఇస్తలేరని విమర్శించారు. కర్ణాటక ముఖ్యమంత్రి కామారెడ్డి  డిక్టరేషన్లో బీసీలకు పెద్దపీట వేస్తామని  అన్నారని గుర్తు చేశారు. అదేవిధంగా  ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో  బీసీలకు 42% రిజర్వేషన్ దేశానికి రోల్ మోడల్ గా అయిందని, సీఎం రేవంత్ రెడ్డి బీసీల పట్ల మొగ్గు చూపుతున్నారని, గత ప్రభుత్వం బీసీలకు 30% ఉంటే 27% తగ్గించిందని, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత బీసీ కులగన చేసి 42 శాతం రిజర్వ్ రిజర్వేషన్ ఇవ్వాలని శాసనసభలో బిల్లు పెట్టి చట్టబద్ధ కల్పించి, కేబినెట్ మీటింగ్లో ఆర్డినెన్స్ తేవడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క హామీ నెరవేరుతుందని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లు ఉచిత కరెంటు, రైతు భరోసా రైతు, రుణమాఫీ, ఉచిత సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, అనేక సంక్షేమ పథకాలు అమలు అమలు చేస్తుందని అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో  ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం అని అన్నారు.  గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఎన్నో అక్రమాలకు పాల్పడిందని అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. కేటీఆర్ మతి లేకుండా మాట్లాడుతున్నారని, కెసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని అన్నారు.  ఈ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీవో రాజేంద్ర కుమార్,తహాసీల్దార్ సతీష్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి  యోహాన్, పీసీసీ జనరల్ సెక్రటరీ  నాగేష్ రెడ్డి పి సిసి డెలికేట్ శేఖర్ గౌడ్,  ఐ సి డి ఎం ఎస్ చైర్మన్ తారాచంద్, ఎన్ డి సి సి  వైస్ చైర్మన్ నల్ల చంద్ర శేఖర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు  పోలసాని శ్రీనివాస్, డీసీసీ డెలికెట్ ధర్మగౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు  శ్యామ్ సన్, వాసు బాబు కాంగ్రెస్ మండల అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, నవీన్ గౌడ్, పి ఏ సి ఎస్ చైర్మన్  రాంచందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఉమ్మాజీ నరేష్, రెవిన్యూ అధికారులు, రేషన్ డీలర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Issuance of new ration cards is a continuous process.

More articles

Latest article