- దసరా సెలవులలో ఆసుపత్రి సేవలకు ప్రొఫెసర్ల డుమ్మా
- ఆఫ్షనల్ హలీడేల పేరిట విదేశాలకు చక్కేసిన వైనం
- హైదరాబాద్ లో తిష్ట వేసిన ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్లు
- విదేశాలకు వెళ్లేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి ఇచ్చారా..?
- ఇంచార్జీ కనుసన్నులలోనే ఇదంతా జరుగుతుందా
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం వైద్య కళాశాలలో బోదన చేస్తు, అనుబంధ జిజిహెచ్ లో సీనియర్, జూనియర్ విద్యార్ధులకు గైడెన్స్ చేస్తు సూపర్ స్పెషాల్టి వైద్య సేవలలో తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోని పలు విభాగాలకు అధిపతులుగా (హెచ్ఓడి) లుగా ఉన్నవారంతా ప్రొఫెసర్లే. కాని వారు తమ స్థాయిలోని వ్యక్తి ఇంచార్జీ సూపరింటెండెంట్ గా వ్యవహరిస్తుండటంతో రెగ్యూలర్ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పనిచేయకపోవడంతో ఇంచార్జీ అధికారులను ఖాతరు చేయడం లేదు. కొందరు షాడో సూపరింటెండెంట్ లుగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడే అప్రాన్ లు ధరించి తాము నిత్యం వైద్య సేవలలో అందుబాటులో ఉన్నామనే విధంగా వ్యవహరిస్తున్నారు.
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 31 మంది ప్రొఫెసర్లు,150 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 13 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు. అందులో 8 మంది ప్రొఫెసర్లు,20 మంది అసిస్టెంట్, 4 అసోసియేట్ ప్రొఫెసర్లకు కళాశాలకు బోధనకే పరిమితం. మిగిలిన ప్రొఫెసర్లు 23 మంది,130 మంది అసిస్టెంట్, 9 మంది అసోసియేట్ లు అటు బోదనతో పాటు ఇటు వైద్య సేవల (జిజిహెచ్ లో)కు అందుబాటులో ఉండాలి. అప్పుడే ఏడంతస్థుల భవనంలో 750 పడకలలో, నిత్యం 1500 మందికి పైగా ఓపీ సేవలలో పేదలకు 24 గంటల వైద్యం అందుబాటులో ఉంటుంది. ఇదేం జరుగడం లేదు. ఎందుకంటే ఇంచార్జీ సూపరింటెండెంట్ లను ప్రొఫెసర్లు అసలు పట్టించుకోవడం లేదు వారి బాటాలోనే అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు వ్యవహరిస్తున్నారు. జిజిహెచ్ లో పకడ్బందీగా హాజరు వ్యవస్థ పనిచేయడం లేదు. పేరుకు బయోమెట్రీక్, ఫేస్ రికగ్నైజేషన్ వ్యవస్థల పరిధిలో హాజరు వేస్తున్నామని, సెలవులలో పక్కాగా పనిచేస్తున్నామని అధికారులు చెబుతుంటే మరి జిల్లా జనరల్ ఆసుపత్రిలో అధికారులు లేకుండా కేవలం పీజీ విద్యార్ధులే ఎలా మ్యానేజ్ చేస్తున్నారంటే అధికారుల వద్ద సమాధానం లేదు.
నిజామాబాద్ ప్రభుత్వ వైధ్య కళాశాల అనుబంధ జిల్లా జనరల్ ఆసుపత్రి (జిజిహెచ్) లో దసరా సెలవుల సంధర్బంగా ప్రొఫెసర్ల సేవలు కనిపించనే లేదంటే అతిశయోక్తి కాదు. ఇంచార్జీ సూపరింటుండెంట్ సెలవులో ఉంటే ఆయన స్థానంలో మరో ఇంచార్జీ అధికారి సూపరింటెండెంట్ గా వ్యవహరించారు. దసరా, ఆదివారాలు జనరల్ హలీడేలు కాగా మిగితా దినాలలో ప్రొఫెసర్లు అంతా కుడా అప్షనల్ హలీడే (ఐచ్చిక సెలవు) గా ప్రకటించారు. మరి వారు విభాగాధిపతులు ఆప్షనల్ సెలవులను ఉపయోగించుకున్నప్పుడు ఇతరులకు సంబంధిత సేవలకు ఇంచార్జీ బాధ్యతలను అప్పగించడం సాధారణం. కాని కొందరు ఆప్షనల్ హలీడే రోజులలో హైద్రాబాద్ కు సొంతూళ్లలో ఉండి పీజీ విద్యార్ధులతో పని కానివ్వడం విశేషం. మరికొంతమంది ఏకంగా విదేశాలకు వెళ్లడం కలకలం రేపింది. హెచ్ఓడిలు విదేశాలకు వెళ్లిన వారి కనుసన్నులలోనే ఎస్ఆర్ లు పనిచేయడం గమనార్హం. ఇదిలా ఉండగా సూపరింటెండెంట్ వద్ద సెలవులు తీసుకున్న వారు జిల్లా లేదా రాష్ట్ర పరిధిలోనే వెళ్లాలి. మరి రాష్ట్ర సరిహద్ధు దాటిన, దేశ సరిహద్ధు దాటిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. కాని గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారు దసరా సెలవులలో విదేశాలకు వెళ్లాడానికి ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా, తీసుకుంటే వారి స్థానంలో ఎవ్వరిని ఇంచార్జీలుగా నియమించారు అనే చర్చ జరుగుతుంది. కొందరు మాత్రం హాజరుకు సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకోరు… విదేశాలకు వెళ్లడానికి ప్రభుత్వ అనుమతి తీసుకుంటారా అని అంటు లేదని అంటున్నారు. జిజిహెచ్ లో అధికారుల అటెండెన్స్ అంతా కుడా మేనేజ్ మంత్రా అని పేర్కొంటున్నారు. జిజిహెచ్ లో జిల్లా కలెక్టర్ తనిఖీలకు వచ్చే విషయం కూడా లీక్ అవుతుందని అందుకే తనిఖీలలో ఎన్నడు పట్టుబడిన దాఖాలలు లేవు వారి పై చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు.
