26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమా..?

Must read

📰 Generate e-Paper Clip

  • కోర్టు చెప్పినా సరే ఆదివారం ఇళ్లు కూల్చుతారా..?
  • మళ్లీ హైడ్రా బుల్డోజర్ వస్తే నేనే అడ్డుగా నిలుచుంటా
  • గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతల బాధితులకు కల్వకుంట్ల కవిత పరామర్శ

 

హైదరాబాద్, బతుకమ్మ : పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమా..?, కోర్టు చెప్పినా సరే ఆదివారం ఇళ్లు కూల్చుతారా..? అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం గాలిపోచమ్మ బస్తీలో కూల్చివేతల బాధితులకు సోమవారం ఆమె పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘పేదల ఉసురు తీసుకోకవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న. బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రూ. 50 వేలు సాయం అందించాలి. మళ్లీ హైడ్రా బుల్డోజర్ వస్తే నేనే అడ్డుగా నిలుచుంటా. అరెకపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాల సంగతేందీ?. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి  వైఎస్ ప్రభుత్వంలో భూములు ఇచ్చారు. ఆనాడే కంచె వేసి ఉంటే ఈ భూములు కబ్జా అయ్యేవి కాదు.  పోచమ్మ బస్తీ చుట్టు పక్కల ఉన్న దాదాపు 4 వందల ఎకరాల్లో కబ్జాలు జరిగాయి. చాలా ప్రభుత్వాలు మారినప్పటికీ భూముల రక్షణను పట్టించుకోలేదు. హైడ్రా హడావుడిగా వచ్చి పెద్ద వాళ్ల జోలికి పోకుండా…పేదల ఇళ్లను రాత్రికి రాత్రికి కూలగొట్టటం దారుణం. చిన్న పిల్లలు ఉన్నారు. మరోపక్క పండుగ ఉంది. ఈ సమయంలో వారి ఇళ్లు కూలగొట్టటం అమానుషం. గతంలోనే కోర్టు శని, ఆదివారాలు ఎవరి జోలికి వెళ్లవద్దని స్పష్టంగా చెప్పింది. వాళ్లకు న్యాయం కోసం కోర్టుకు వచ్చే అవకాశం ఇవ్వాలని కోరింది. అయినప్పటికీ ఆదివారం రోజు ఇళ్లను కూలగొట్టారు. గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు ఉన్న వాళ్ల ఇళ్లను కూడా కూలగొట్టారు. పిల్లలు, ముసలి వాళ్లు ఉన్న కూడా పట్టించుకోలేదు. పైగా నోటీసులు ఇచ్చామంటూ అబద్దాలు చెబుతున్నారు. పండుగ పూట పేదల ఉసురు తీసుకోకండని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ముందు వారికి డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వండి. తక్షణ సాయం కింద రూ. 50 వేలు ఇవ్వండి. పేదలకు అన్యాయం చేస్తే ప్రభుత్వానికి ఉసురు తాకుంది. మళ్లీ ఈ నెల 6 లోపు హైడ్రా వాళ్లు వస్తామని చెప్పారంటా. ఆ లోపు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి. ఇక్కడ మొత్తంగా 200 లోపు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. వారందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వండి. లేదంటే హైడ్రా బుల్డోజర్ కు అడ్డంగా నేను నిలుచుంటా. బాధితులతో కలిసి వారి వివరాలు తీసుకొని నేనే వస్తా. ఎక్కడకి రమ్మంటారో చెప్పండి. ముఖ్యమంత్రే మున్సిపల్ మంత్రిగా ఉండి గడీలో ఉంటున్నాడు. ఆఫీస్ కు, సెక్రటేరియేట్ కు రాడు. ఎక్కడ బాధలు చెప్పుకోవాలి. ప్రజా పాలన పేరుతో సమస్యలు చెప్పుకోవాలని అంటున్నారు. రెండేళ్లలో ముఖ్యమంత్రి ఒక్కసారి మాత్రమే ప్రజాపాలన వద్దకు వచ్చాడు. అసలు ప్రజలు తమ బాధలు ఎవరికీ చెప్పుకోవాలి. బాధితుల వివరాలు తీసుకుంటున్నాం. మళ్లీ బుల్డోజర్ వచ్చే లోపు వారికి డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలి. అరెకపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాలను తొలగించాలి.  కూలీ చేసుకొనే వాళ్ల ఇళ్లను కూల్చేస్తూ హీరోయిజం చూపిస్తున్నారా? వెంచర్లు చేసి అమ్మటంతో చాలా మంది లక్షలు పెట్టి కొనుక్కున్నారు. వాళ్లకు ప్రభుత్వం డబ్బులు తిరిగి చెల్లించాలి. ఎకరాల కొద్దీ పెద్దవాళ్లు చేసిన కబ్జాలు ప్రభుత్వానికి కనబడటం లేదా?  ముందు వాటిని కూలగొట్టండి. పేదవాళ్ల భూములు మాత్రమే ప్రభుత్వానికి కనబడుతున్నాయా? 6 వ తేదీ లోపు బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నా’’ అని అన్నారు.

Is Pratap leaving the elders and focusing on the poor?

More articles

Latest article