30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పట్టణ ప్రముఖ వైద్యులకు ఊర పండగ ఆహ్వానం

Must read

📰 Generate e-Paper Clip

 

భీమ్ గల్, బతుకమ్మ :

 

పట్టణ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ అత్యంత ప్రతిష్టత్మకంగా జరుపనున్న ఊర పండగకు అన్ని రంగాల ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా సర్వ సమాజ్ కమిటీ పట్టణానికి చెందిన రాజకీయ నాయకులను, ప్రజాప్రతినిధులను, డాక్టర్లను, ఇంజనీర్ లను అన్ని రంగాలలో పని చేస్తున్న ఉన్నతాధికారులను ఆహ్వాన పత్రాలను అందజేస్తున్నారు. సోమవారం పట్టణానికి చెందిన ఆర్మూర్ ఎం. జె హాస్పిటల్ వైద్యులు డాక్టర్. బి. మధు శేఖర్, ఎల్. కె హాస్పిటల్ వైద్యులు.డాక్టర్. అశోక్, లైఫ్ హాస్పిటల్ డాక్టర్. ఆర్. భాను ప్రకాష్ లను సర్వ సమాజ్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఊర పండగ ఆహ్వాన పత్రాలను అందజేశారు.

More articles

Latest article