25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎక్లాస్ పూర్ పంచాయతీ కార్యదర్శి పై విచారణ 

Must read

📰 Generate e-Paper Clip

  • కార్యదర్శి పంచాయతికి  రావడం లేదనే అంశం పై వంద శాతం ఓటింగ్…
  •  క్షేత్రస్థాయిలో  పరిశీలించిన డీపీఓ శ్రీనివాస్ రావు

 

బతుకమ్మ, కోటగిరి : గ్రామ పంచాయతీ సెక్రెటరీ  విధులకు సరిగా రాకపోవడంతో పాటు  పారిశుద్ధ్యం, మిషన్ భగీరథ నీటి సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ నాయకుల ప్రోద్బలంతో  ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కు ఫిర్యాదు చేయడంతో  ఆయన విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశానుసారం  డిపిఓ శ్రీనివాసరావు  గురువారం గ్రామస్తుల సమక్షంలో విచారణ చేపట్టారు. గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న స్వాతి  గత కొద్దిరోజులుగా విధులకు సరిగా రావడం లేదంటూ గ్రామస్తులు  అధికారుల ముందు ముక్తకంఠంగా వివరించారు. గ్రామంలో  చాలా రోజుల నుండి డ్రైనేజీలను  తీయడం లేదంటూ  అదేవిదంగా చెత్త సేకరణ చేయడం లేదంటూ  అధికారులకు వివరించారు. మిషన్ భగీరథ నీటి సమస్య ఉందని ఎన్నిసార్లు చెప్పినా  పంచాయతీ కార్యదర్శి పట్టించుకోకుండా రాజకీయ నాయకుల ప్రోత్బలంతో  ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని  ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు డిపిఓ శ్రీనివాసరావు, డిఎల్పిఓ నాగరాజు, ఇన్చార్జ్ ఎంపీడీవో  చందర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి విచారణ చేపట్టారు. నివేదికను కలెక్టర్కు అందజేసి  తమ గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని డిపిఓ శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Investigation against Eklaspur Panchayat Secretary

More articles

Latest article