బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయ బృందం యుద్దభేరి పోష్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా సీపీఎస్ఈయూ అధ్యక్షుడు కుంట్ల ఎల్లారెడ్డి మాట్లాడుతూ 2004 నుండి నియామకం పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ తొలగించి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను అమలులో తేవడం జగిరిందని, ఇప్పుడు మళ్ళీ నూతగంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీంను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, దానిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరడం జరిగింది. ఆ యూనిఫైడ్ పెన్షన్ స్కీం మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా, మేనిఫెస్టో లో పెట్టిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ స్కీం ను వెంటనే అమలు చేయాలని వచ్చే నెల అనగా మార్చి రెండవ తేదీన ఇందిరా పార్క్ వద్ద చలో ధర్నా కార్యక్రమం తలపెట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ చలో ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్రంలోని సీసీఎస్ ఉపాధ్యాయులు అందరూ పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలునపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్, బిచ్కుంద మండల అధ్యక్షుడు శేఖ్ అహ్మద్, జిల్లా భాద్యులు గంగారాం, ఎస్జీటీ యునియన్ మండల అద్యక్షులు శేఖ్. ఖయ్యూమ్, మండలం ఇతర సీనియర్ ఉపాధ్యాయులు బ్రహ్మానందం, అర్. సంతోష్, అన్సార్ గోరి, యన్. శ్రీనివాస్, కే.విజయ్, నాగనాథ్, సంఘమేశ్వర్ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.