. . . మియాపూర్ సీఐ శివప్రసాద్‌పై వేటు
హైదరాబాద్, బతుకమ్మ :
సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో మియాపూర్ సీఐ శివప్రసాద్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయనను సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మియాపూర్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం మరియు భవన యజమాని మధ్య కొనసాగుతున్న సివిల్ వివాదంలో సీఐ శివప్రసాద్ జోక్యం చేసుకున్నట్లు ఉన్న ఫిర్యాదులపై విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పోలీసు అధికారులు సిబ్బందికి స్పష్టమైన సూచనలు జారీ చేశారు. సివిల్ వివాదాల్లో పోలీసు అధికారులు అనవసరంగా జోక్యం చేసుకోవద్దని, తమ విధి పరిధిలోనే వ్యవహరించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ చర్యతో సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యంపై శాఖ మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
