నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 33/11 KV PHC పవర్ హౌస్ సబ్ స్టేషన్ లో సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా పాత 8ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ తీసి కొత్తగా 12.5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ గురువారం ఏర్పాటు చేస్తున్నట్లు నిజామాబాద్ టౌన్ ఏడీఈ ఆర్.చంద్ర శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా పవర్ హస్ సబ్ స్టేషన్ పరిధి లో గల గాజులపేట్, దారుగల్లి , శివాజీ నగర్, న్యాల్కల్ రోడ్, సాయినగర్, అనందనగర్, నాగరం , ఇంద్రాపూర్, బాబాన్స్పుహెడ్ , ఆర్జీకే క్వార్టర్స్, మాలపల్లి, శాంతినగర్, హష్మీ కాలనీ, అహ్మేదిబజార్,శంబునిగుడి ఏరియా లలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
