- యోగ ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్
బతుకమ్మ, భిక్కనూరు : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భిక్కనూరు పోలీస్ స్టేషన్ లో యోగ కార్యక్రమాలు నిర్వహించామని భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సన్నాహకంలో భాగంగా శనివారం పోలీస్ స్టేషన్లో యోగాసనాలు చేశారు.మన శరీరం, మనసు ,ఆత్మ మధ్య ఉన్న దూరాన్ని చదివించి వాటిని ఏకరూపత లోకి తీసుకురావడం యోగ ప్రధాన ధ్యేయం అని అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని భిక్కనూరు హైమద్ బిఈడి కళాశాలలో విద్యార్థులతో యోగా కార్యక్రమాలు నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎండి హనిఫ్ పాషా అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
