29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఐటీఐ న్యూ గర్ల్స్ సంస్థలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కన్వీనర్ జి.యాదగిరి, ప్రిన్సిపాల్ ఎం.ఎ.బసిత్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐఎంసీ చైర్మన్ రాజీవ్ దువా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మహారాష్ట్ర సామాజిక సంస్కర్త, మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలు సావిత్రి బాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా సన్మానించారు. మహిళల సాధికారత, విద్య, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర గురించి మాట్లాడారు.

More articles

Latest article