27.8 C
Hyderabad

ఆగస్టు 31 వరకు ఇంటర్ అడ్మిషన్లు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలను ఈ నెల 31వ తేదీ వరకు చేపట్టనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలతో పాటు అన్ని గురుకుల జూనియర్ కళాశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 31వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌లో ప్రవేశం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు కళాశాలల్లో చేరని పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఇంకా అడ్మిషన్ పొందని విద్యార్థులను గుర్తించి కళాశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి ఆదేశించారు. విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా ప్రతి అర్హత కలిగిన విద్యార్థికి ఇంటర్మీడియట్ విద్య అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

More articles

Latest article