24.7 C
Hyderabad

గురువారం ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల పోచంపాడ్ నందు 2025-26 విద్యా సంవత్సరంలో ఎంపీసీ బైపిసి మొదటి సంవత్సరమున ఖాళీ సీట్ల భర్తీకి జులై 31న పార్ట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గోదావరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు మార్క్ మెమో, కులం సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్, పుట్టినరోజు సర్టిఫికెట్ తీసుకొని రావలసిందిగా సూచించారు. గురువారం ఉదయం 9 గంటల నుండి ఒంటిగంట వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయని మధ్యాహ్నం రెండు గంటల నుండి కౌన్సిలింగ్ నిర్వహించి ఎంపికైన విద్యార్థుల జాబితాను అదే రోజు నోటిస్ బోర్డ్ లో ప్రదర్శిస్తామని తెలియజేశారు.

More articles

Latest article