28.8 C
Hyderabad
Monday, August 3, 2026

కరెంట్ షాక్ తో మృతి చెందిన వ్యక్తి భార్యకు 50 లక్షల భీమాసొమ్ము చెల్లించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మానసిక వేదనకు గురి చేసినందుకు 5 వేలు, ఖర్చులకు గాను 5 వేలు చెల్లించాలి

 

. . . నిజామాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్ పర్సన్ సువర్ణ జయశ్రీ తీర్పు

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ

 

వ్యవసాయ భూమిలో పనులు చేస్తూ కరెంట్ షాక్ తో మృతి చెందిన ఏనుగు చంద్రశేఖర్ భార్య ఏనుగు పద్మకు ఫ్యామిలి ఆక్సిడెంటల్ కేర్ ఇన్సూరెన్స్ పాలసి ప్రకారం స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 50 లక్షల రూపాయలు భీమా సొమ్ము చెల్లించాలని నిజామాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షురాలు సువర్ణ జయశ్రీ తీర్పు చెప్పారు. ఏనుగు చంద్రశేఖర్, పద్మ దంపతులు ఆర్మూర్ పట్టణ శివారులోని ఆలూర్ రహదారి పక్కన ఇంటిలో నివాసముంటు భారత్ గ్యాస్ సుమన్ వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకునే వారు. వారు స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిజామాబాద్ బ్రాంచ్ లో 4426 రూపాయల ప్రీమియం చెల్లించి 50 లక్షల ఫ్యామిలి ఆక్సిడెంట్ కేర్ ఇన్సూరెన్స్ పాలసి తీసుకున్నారు. రోజువారి వ్యవసాయ పనులలో భాగంగా 2023 ఫిబ్రవరి, 21 న పొలంలోని బోర్ బావి దగ్గర కరెంట్ మీటర్ ఆన్ చేయబోగ కరెంట్ షాక్ తో మృతి చెందాడు. అతని భార్య ఏనుగు పద్మ నిన్నవెల్లిన తన భర్త ఇంటికి రాకపోయేసరికి బంధువులతో వెతకగా పొలంలోని మోటారు బావి దగ్గర భర్త చంద్రశేఖర్ చనిపోయి ఉండటం గమనించింది. సంఘటన గూర్చి ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ నివేదికను రూపొందించిన అనంతరం మృతుడు చంద్రశేఖర్ ను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి డాక్టర్ చే పోస్ట్ మార్టం చేయించిన పోలీసులు పూర్తిస్తాయిలో విచారణ అనంతరం ఫైనల్ రిపోర్ట్ ను మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించారు. కేసుకు సంబందించిన అన్ని పత్రాలతో మృతుడు చంద్రశేఖర్ భార్య పద్మ సీనియర్ న్యాయవాది నల్లవెల్లి శ్రీనివాస్ రెడ్డిని సంప్రదించడంతో ఆయన ఆమె అందజేసిన పత్రాలను అధ్యయనం చేసి పిటిషన్ ను తయారు చేసుకుని వినియోగదారుల పరిరక్షణ చట్టం -2019 ప్రకారం నిజామాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదులో స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిజామాబాద్ బ్రాంచ్ ను, చెన్నై ప్రధాన కార్యాలయ స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ కంపెనీ లిమిటెడ్ ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. కమిషన్ నోటీసులు స్వీకరించిన స్టార్ హెల్త్ అధికారులు ఫిర్యాదులు జవాబులు దాఖలు చేస్తూ మృతుడు చంద్రశేఖర్ కరెంట్ మోటారును రిపేర్ చేసే క్రమంలో కరెంట్ షాక్ తగులుతుందని తెలిసి రిపేర్ చేశాడని అందుకు అనుగుణంగా స్టార్ హెల్త్ డాక్టర్ల నివేదించారని తెలిపారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలి ఆక్సిడెంట్ కేర్ ఇన్సూరెన్స్ పాలసి ప్రకారం 50 లక్షలు ఇవ్వబోమని వారి న్యాయవాది ద్వారా జవాబు దాఖలు. ఫిర్యాదుదారు పద్మ న్యాయవాది, స్టార్ హెల్త్ తరపున న్యాయవాది సమర్పించిన పత్రాలు వారి వాదనలు విన్న కమిషన్ అధ్యక్షురాలు సువర్ణ జయశ్రీ ఆర్మూర్ పోలీసులు నమోదు చేసిన ప్రాథమిక విచారణ నివేదిక, ఫైనల్ రిపోర్ట్, పోస్ట్ మార్టమ్ నివేదిక, స్టార్ హెల్త్ ప్యామిలి ఆక్సిడెంట్ కేర్ ఇన్సూరెన్స్ పాలసి ఇతర పత్రాలు, స్టార్ హెల్త్ అందజేసిన పత్రాలు అధ్యయనం చేసిన అనంతరం ఇన్సూరెన్స్ పాలసి ప్రకారం మృతుడు చంద్రశేఖర్ భార్యకు యాబై లక్షల రూపాయల భీమా సొమ్ము అందజేయాలని తీర్పు వెలువరించారు. భీమా సొమ్ము చెల్లించకుండా పద్మను మానసిక వేదనకు గురి చేసినందుకు గాను 5 వేలు, ఖర్చులకు గాను 5 వేలు చెల్లించాలని కమిషన్ తీర్పులో పేర్కొన్నది. తీర్పు వెలువరించిన 45 రోజులలోపు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లో 50 లక్షలు డిపాజిట్ చేయాలని తీర్పులో పేర్కొన్నారు.

More articles

Latest article