34.3 C
Hyderabad

అభివృద్ధి పనుల తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

  • పలు గ్రామాలను సందర్శించిన ఎంపీడీఓ

బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి : భీంగల్ మండలంలోని కుప్కాల్, బాబానగర్, ముచ్కూర్ గ్రామాలను ఎంపీడీఓ సంతోష్ కుమార్ శుక్రవారం సందర్శించారు. స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో నర్సరీ ప్లాంటేషన్లను, శానిటేషన్ పనులను పరిశీలించారు. అన్ని గ్రామాల్లో స్వచ్చదనం కార్యక్రమం లో భాగంగా పిచ్చి మొక్కలను తొలగించి, రెగ్యులర్ గా బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, డ్రైనేజీలను శుభ్రపరచాలని ఆదేశించారు. రోడ్ల కిరువైపులా నాటే మొక్కలను రెండు రోజుల్లో పూర్తి చెయ్యాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయా గ్రామ పంచాయతీల రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఎపిఓ జీ. నర్సయ్య సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article