బతుకమ్మ, వేల్పూర్:-మండలం లోని జిల్లా వ్యవసాయ అధికారి వాజీద్ హుస్సేన్ వేల్పూర్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయం సహకార సంఘం పచ్చల నడుకుడా, రామన్నపేట, వేల్పూర్, అంక్సాపూర్, లక్కోర శాఖలను శుక్రవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఎరువుల విక్రయాలు పి వై ఎస్ మెషిన్ ద్వారా మాత్రమే జరపాలని, స్టాక్ రిజిస్టర్ లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. రోజువారి ఎరువుల నిల్వల వివరాలు వాటి ఎమ్మార్పీ ధరలు బోర్డుపైన రాసి ఉంచాలని తెలిపారు. రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని, దాని కొరకు ఎప్పటికప్పుడు మండల వ్యవసాయ అధికారికి ఇండెంట్ లను పెట్టాలని తెలిపారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి శృతి, ఏఈఓ సాయిరామరాజు, సొసైటీ కార్యదర్శులు, సేల్స్మెన్ ఉన్నారు.
