భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని బడా భీమ్ గల్, సికింద్రాపూర్ గ్రామాల్లో ఎన్నరీజీఎస్ నిధులతో నిర్మితం అవుతున్న పశువుల షెడ్ లను ఎంపీడీఓ సంతోష్ కుమార్ మంగళవారం పరిశీలించారు.వీటితో పాటు ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే, నర్సరీలను ఎంపీడీఓ పరిశీలించారు. ఆయన వెంట ఈజీఎస్ ఏపీఓ జి. నర్సయ్య, ఈజీఎస్ సిబ్బంది పూర్ణచంద్, రమేష్, గణేష్, జీ. పీ సెక్రెటరీలు రజిత, గణేష్ లు ఉన్నారు.
