29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీశైలం ప్రాజెక్టుకు 88 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో కొనసాగుతోంది. సుంకేసుల ప్రాజెక్టు నుంచి 4,379 క్యూసెక్కులు, జూరాల నుంచి 83,616 క్యూసెక్కులు మొత్తం 87,995 క్యూసెక్కులు ఇన్ ఫ్లో కొనసాగుతోంది. 12,713 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 (215.8070 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 818 (39.3750 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. తెలంగాణ ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది.

More articles

Latest article