29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎనిమిదవ రోజు ఉదయం యాగం, మహా పూర్ణాహుతి, స్వామివారి రథోత్సవం, శ్రీ చక్ర స్నానం

 

. . . సాయంత్రం శ్రీ పుష్ప యాగం

 

మోపాల్, బతుకమ్మ :

 

మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి లో గల ఇందూర్ తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా మహా పూర్ణాహుతి నిర్వహించి అనంతరం స్వామి వారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ మాడవీధుల్లో భక్తులు రథాన్ని లాగగా, వేలాదిమంది కదలిరాగా గోవింద నామస్మరణతో మాడవీధులు పులకించిపోయాయి. దిల్ రాజు సోదరులు శిరీష్ రెడ్డి నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి స్వయంగా స్వామివారి రథాన్ని లాగుతు ముందుకు నడిచారు. నర్సింగ్ పల్లి గ్రామ మహిళలు హారతులు పట్టుకొని స్వామివారికి స్వాగతం పలుకుతూ దారి వెంట నృత్యాలు చేసుకుంటూ నడిచారు. రథోత్సవం అనంతరం స్వామి వారికి చక్ర స్నానం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలో స్వామివారికి చక్ర స్నాన కార్యక్రమాన్ని దేవనాథ జియర్ స్వామి వారు, యజ్ఞాచార్యులు, వేద పండితులు, అర్చక స్వాములు నిర్వహించారు.

 

Indore Tirumala Brahmotsavam continues with grandeur

 

పుష్కర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ఉదయం యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. మహా పూర్ణాహుతి అనంతరం త్రిదండి దేవనాథ జియర్ స్వామి భక్తులను ఉద్యేశించి ప్రవచనాలు చేశారు. భగవంతునిపై ప్రేమతో సేవలు చేస్తున్న ఇందూరు తిరుమల ఇలలో వైకుంఠంగా మారడం ఖాయమని వారు అన్నారు. మనుషులు సదా భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని అన్నారు. భగవంతుడు లోక కార్యం మనుషుల ద్వారా చేస్తారని, భగవంతుడి కృప వల్లనే మనిషి గొప్పగా ఎదుగుతాడని అన్నారు. భగవంతుడు మనల్ని ఎంచుకునేందుకు అర్హత సాధించాలని, మనిషి లోపల భూత దయ, ప్రకృతి పట్ల ప్రేమ, దేశ భక్తి ఉండాలన్నారు. కలి యుగంలో హరి నామమే మోక్ష మార్గం కాబట్టి ప్రతి క్షణం హరి నామం జపిస్తూ ఉండాలని, తాను మోక్ష మార్గాన్ని అనుసరిస్తు సాటి మనిషికి కూడా మోక్ష మార్గాన్ని చూపెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన ధర్మకర్త నర్సింహ రెడ్డి దంపతులు, ప్రముఖ సినీ నిర్మాత సోదరులు దిల్ రాజు దంపతులు, శిరీష్ రెడ్డి దంపతులు, విజయసింహా రెడ్డి దంపతులు, సుదర్శన్ రెడ్డి దంపతులు, ఎంపీటీసీ రాములు, ఫోటో గంగాధర్, ప్రవీణ్, పృథ్వి నారాయణ, నర్సారెడ్డి, నరాల సుధాకర్, రమేష్ భాస్కర్, నరేందర్, రాజేశ్వర్, సాయిలు, గంగారెడ్డి, ప్రమోద్, భూం రెడ్డి, యాజ్ఞాచార్యులు అనంత ఆచార్యులు, రోహిత్ కుమారాచార్యా విజయ్ స్వామి, అనిల్ స్వామి, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

More articles

Latest article