రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఐకేపి ఆధ్వర్యంలో సోమవారం మహిళలకు ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సులేమాన్ నగర్ గ్రామ మాజీ సర్పంచ్ షేక్ ఖాదర్, ఐకేపీ సిసి విట్టల్, మాజీ కోఆప్షన్ మెంబర్ దస్తగిరి, మాజీ సదర్ లతీఫ్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ సోఫీ తదితరులు పాల్గొన్నారు.
