28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని సవరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రుషేగాం భూమయ్య

 

బతుకమ్మ, మద్నూర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అర్హులైన వారికి అందాలంటే కొన్ని నిబంధనలను సవరించాలని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రుషేగాం భూమయ్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మద్నూర్ మండల కేంద్రంలో అయన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు ఆలోచన మంచిదేనని, కానీ ఆ పథకం వర్తించాలంటే ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పని చేసి ఉండాలని, ఎలాంటి భూమిలేని నిరుపేదలకు వర్తిస్తుందని నిబంధనలు పెట్టడాన్ని అయన తప్పు పట్టారు. కూటికి గతి లేక వలస పోయిన నిరుపేదలు ఉపాధి హామీలో ఎలా పని చేస్తారని, అలాంటి వలస కూలీ వారిని సర్వే  చేయించి, పథకాన్ని వర్తింపజేయాలన్నారు. భూమి లేని నిరుపేదలైన వారినే కాకుండా 1 గుంట నుండి 20 గుంటల వరకు భూమి ఉన్నవారిని కూడా నిరుపేదలుగా గుర్తించాలని అన్నారు. ఇలాంటి వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అందేవిధంగా చూడాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు కూడా 5 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం, ఎస్సీ, ఎస్టీ లకు 6 లక్షలు అందించదాన్ని స్వాగతిస్తున్నామని,  కానీ ఎస్సీ, ఎస్టీలలో నిరుపేదలను గుర్తించి వారికి సిమెంటు, ఇసుక, స్టీల్, ఉచితంగా అందించాలని, ఇల్లు కట్టుకునే స్తోమతలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయని,  భూమిలేని నిరుపేదలు, దీనస్థితిలో ఉన్నటువంటి వారి గుర్తించి, ప్రభుత్వమే ఇండ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెండి యాదవరావు మాదిగ, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, కొడప్ గల్, పిట్లం, డోంగ్లీ మండలాల అధ్యక్షులు మారుతి మాదిగ, శంకర్ మాదిగ, ఆయిల్ వారు మారుతి మాదిగ, రవీందర్ మాదిగ, మహిపాల్ మాదిగ. మారుతి మాదిగ, నాయకులు  రవికుమార్ మాదిగ, మారుతీ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article