ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని సవరించాలి
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రుషేగాం భూమయ్య బతుకమ్మ, మద్నూర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అర్హులైన వారికి అందాలంటే కొన్ని నిబంధనలను సవరించాలని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రుషేగాం భూమయ్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మద్నూర్ మండల కేంద్రంలో అయన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు ఆలోచన మంచిదేనని, కానీ ఆ పథకం వర్తించాలంటే ఉపాధి హామీ...