28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బలిపీఠంపై భారత వ్యవసాయరంగం

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి.కోటేశ్వరరావు       

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బలిపీఠంపై భారత వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిలబెడుతుందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి.కోటేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్ లో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం వేల్పూర్ భూమయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరై కోటేశ్వరరావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ కు ముందుగా ప్రభుత్వాలు పంటల ప్రణాళిక చేసుకోవాలి, కానీ నేటికి  ప్రభుత్వాలు సమగ్రమైన పంట ప్రణాళిక రూపొందించుకోలేక పోతున్నారని అన్నారు. విత్తనంలో ప్రభుత్వ సంస్థల కన్నా ప్రైవేట్ విత్తన కంపెనీలే, బహుళ జాతి కంపెనీలు విత్తనాలను అందిస్తున్నాయని, అవి నాణ్యమైనవి కాక పొగ నకిలీ విత్తనాలతో రైతులు నిండా మునుగుతున్నారని అన్నారు. వ్యవసాయ రంగంలో మోడీ ప్రభుత్వం తెచ్చిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించిన ఫలితంగా వాటిని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పినా కేంద్ర ప్రభుత్వం వాటిని దొడ్డిదారిన నూతన వ్యవసాయ మార్కెట్ విధానాల పేరుతో తీసుకొస్తున్నారని తెలిపారు. ఎంఎస్పీ  మద్దతు ధరల గ్యారెంటి చట్టాన్ని తేవడంలో కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నారని అన్నారు. జై జవాన్, జై కిసాన్ అంటున్నాం. జవాన్ కు అన్నం పెడుతున్నది కూడా ఈ రైతే కదా మరి అమర జవాన్ కు జరుగుతున్నా న్యాయం ఆత్మహత్యలు చేసుకున్న రైతుకెందుకు జరుగుతలేదని మోడీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. బ్యాంకులో 18 శాతం రైతులకు రుణాలు అందించాలంటే కనీసం 12 శాతం రుణాలు అందించడం లేదని, పైగా రైతులంటే అప్పులు ఎగ్గొట్టే వారిగా, మోసగాళ్లుగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని బ్యాంకుల నుండి తీసుకున్న కార్పొరేట్ల అప్పులను మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం భారత రైతులకు రుణ విముక్తి చేయడం లేదని అన్నారు.  కార్పొరేట్ బహుళజాతి  సంస్థల గుత్తాధిపత్యం కొనసాగుతుందని భారతదేశ వ్యవసాయానికి మునిపెన్నడూ లేని విధంగా సంక్షోబాన్ని ఎదురుకుంటుందని, పాలకుల రైతు వ్యతిరేక తప్పుడు విధానాలకు ఫలితంగా వ్యవసాయాన్ని, ఖాడినీ వదిలిన రైతులు పట్టణాలకు నగరాలకు వలస వెళుతున్నారు అని అన్నారు.కార్పొరెట్లు నుండి వ్యవసాయన్ని కాపాడుకుందాం, రైతులాని రక్షించుకుదాంమని కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి దెశెట్టి సాయిరెడ్డి,ఉపాధ్యక్షులు ఎల్.నర్సయ్య, బి.సాయిలు, ఎస్.నర్సయ్య, శ్రీనివాస్ రెడ్డి, చిన్నయ్య, గోపాల్,విట్టాల్, బుచ్చన్న,మర్క్స్, బాబురావు, దేవన్న,డి.బన్సీ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article