ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ కార్యాలయం పై తహసిల్దార్ సుజాత,ఎంపీడీవో కార్యాలయం పై ఎంపీడీవో సత్తయ్య, బొప్పాపూర్ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందర ఏఎంసీ చైర్మన్ షేక్ సబేరా బేగం, ఎంఈఓ కార్యాలయం పై ఎంఈఓ కృష్ణ హరి ,వ్యవసాయ కార్యాలయం ఎదుట మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్, పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్,మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, లయన్స్ క్లబ్బు ఎదుట లయన్స్ క్లబ్ అధ్యక్షులు శంకర్, సెస్ కార్యాలయం ఎదుట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి ,డబుల్ బెడ్ రూమ్ ల వద్ద మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కార్యాలయం ఎదుట మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మనోహర చారి, విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కరస్పాండెంట్ ఎండి లతీఫ్, శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో కరస్పాండెంట్ రాజిరెడ్డి, ఎంపీపీఎస్ పాఠశాల లో ప్రధానోపాధ్యాయులు సంపత్ కుమార్ లు జాతీయ జెండాలను ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలలో విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలు, దేశ స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో చిన్నారులు గ్రామస్తులను ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ మెంబర్ ఒగ్గు మహేష్ యాదవ్, ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, వంగ గిరిధర్ రెడ్డి, కాంగ్రేస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, సంతోష్ గౌడ్,పందిర్ల శ్రీనివాస్ గౌడ్,శ్రీనివాస్ యాదవ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

