29 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో  స్వాతంత్య్ర దినోత్సవ వేడుక 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  79 స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ అవంతి రావు జెండా ఆవిష్కరించారు. ఈసందర్భంగా అవంతి రావు మాట్లాడుతూ స్వాతంత్య్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా  స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆరోగ్య విభాగ కో కన్వీనర్ కుల్దీప్ కు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ చీఫ్ గా సెలెక్ట్ అయినందుకు, కమ్యూనిటీ మీడియేషన్ వలంటరీ కోర్టు ద్వారా వచ్చినందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కుల్దీప్ ను సన్మానించారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ భరద్వాజ్ , శ్యామల సాయి కృష్ణ, శోభవతి, కుల్దీప్, రాజేష్ , హరీష్ యాదవ్, సందీప్ ,ఆకాష్, రమేష్ నాయక్, అరుణ్, దామోదర్, రాజశేఖర్, రేఖ ,సరిత, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Independence Day celebration under the auspices of Telangana Jagruti

More articles

Latest article