25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మహిళలపై పెరుగుతున్న హింస 

Must read

📰 Generate e-Paper Clip

  • ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహిళలపై రోజురోజుకు హింస పెరిగిపోతుందని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో హింసకు గురై అడ్మిట్ అయిన మహిళను గురువారం ఐద్వా నాయకులు పరామర్శించారు. వినాయక్ నగర్ నివాసి బి.లక్ష్మిని  భర్త  తడిక శ్రీకాంత్,  అత్త శోభ, మరిది హరికాంత్ విపరీతంగా కొట్టి పడేసి వెళ్లిపోయారు. దీంతో ఆమెను నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.  విషయం తెలసుకున్న ఐద్వా నాయకులు ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ఇలాంటి వారికి కఠినమైన శిక్షలు పడాలన్నారు. శ్రీకాంత్ కి జీవిత కైనా శిక్ష వేసి బయటకు రాకుండా చేయాలలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు వనిత, జిల్లా కమిటీ సభ్యులు కళా, స్వప్న పాల్గొన్నారు.

More articles

Latest article