బతుకమ్మ,మోర్తాడ్: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాకతీయ కాలువకు నీటి విడుదల పెంచడం జరిగింది బుధవారం వరకు కాకతీయ కాలువ ద్వారా 3500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతూ ఉండటం తెలిసింది గురువారం ఉదయం 500 క్యూసెక్కుల అదనంగా పెంచడంతో ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా 4000 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. వరద కాలువ ద్వారా 5000 క్యూసెక్కులు, లక్ష్మీ కాల్వ ద్వారా 250 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 700 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1087 అడుగులు, 67.057 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత సంవత్సరం ఇదే రోజు ప్రాజెక్టులో 1084.90 అడుగులు, 59.502 టిఎంసిల నీరు నిలువ ఉంది.
