25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మేధావుల సంఘీభావ సభ కరపత్రాల ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : జనవరి 11న నిర్వహించే  ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకై మేధావుల సంఘీభావ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక రోడ్డు భవనాల అతిథిగృహంలో ఆదివారం మాదిగ ఉద్యోగులు మేధావుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సిల్మల సురేష్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తలపెట్టిన లక్ష డప్పులు వెయ్యి గొంతులు ఫిబ్రవరి 7న విజయవంతం చేయడం కోసం ప్రొఫెసర్ కాసిం అధ్యక్షతన ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో మేధావుల సంఘీభావ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి నిజామాబాద్ జిల్లాలోని మాదిగ, ఉపకులాల ఉద్యోగస్తులు మేధావులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు మేధావి వర్గం సామాజిక బాధ్యతగా స్వీకరించి ఎమ్మార్పీఎస్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ మాదిగ, ఉద్యోగుల ప్రతినిధులు నాంపల్లి, తెడ్డు గంగారం, మహేష్ కుమార్, రమేష్ ,మారుతి, శ్రీనివాస్, కోటేశ్వరరావు,వినోద్ కుమార్, సిద్ధిరాములు,సహదేవ్, లక్ష్మణ్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article