మేధావుల సంఘీభావ సభ కరపత్రాల ఆవిష్కరణ
నిజామాబాద్, బతుకమ్మ : జనవరి 11న నిర్వహించే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకై మేధావుల సంఘీభావ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక రోడ్డు భవనాల అతిథిగృహంలో ఆదివారం మాదిగ ఉద్యోగులు మేధావుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సిల్మల సురేష్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తలపెట్టిన లక్ష డప్పులు వెయ్యి గొంతులు ఫిబ్రవరి 7న విజయవంతం చేయడం కోసం ప్రొఫెసర్ కాసిం అధ్యక్షతన ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో మేధావుల...