- పి సి సి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఘన స్వాగతం పలుకుదాం
- చరిత్రలో నిలిచిపోయేలా కాంగ్రెస్ శ్రేణుల కార్యక్రమాన్ని నిర్వహిద్దాం
- విస్తృత స్థాయి సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
బతుకమ్మ నిజమాబాద్ సిటీ : పిసిసి అధ్యక్షుడి గా జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అక్టోబర్ 4 న జిల్లా కు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి ఘన స్వాగతం పలుకుదామని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లాకు ప్రత్యేక స్థానం ఆది నుంచి కల్పిస్తూనే ఉందని కాంగ్రెస్ పార్టీ అందుకే రెండోసారి పిసిసి అధ్యక్షుడిగా జిల్లా వాసులను గుర్తించడం పార్టీకి ఉన్న ప్రత్యేకత అని అన్నారు. కార్యకర్త స్థాయి నుండి అంచులంచెలుగా ఎదుగుతూ నేడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎదగడం మహేష్ కుమార్ గౌడ్ వారి కష్టానికి ఫలితం దక్కిందన్నారు. నాలుగవ తేదీన మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కేంద్రంలో తలపెడుతున్న బహిరంగ సభకు ఆయనతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టాన నాయకులు కూడా ఆయనతోపాటు జిల్లాకు రానున్న సందర్భంగా ఈ సభను కాంగ్రెస్ శ్రేణులు అందరూ విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ప్రతి నియోజకవర్గ నుండి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యులు ప్రత్యేక చొరవ వహించి అధిక సంఖ్యలో కార్యక్రమాన్ని కి హాజరయ్యేలా చూడాలని ఆయనపార్టీ శ్రేణులను కోరారు. ఈ సభ ద్వారా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం ఏంటో ప్రతిపక్షాలకు తెలియ చెప్పాల్సిన అవసరం కూడా మన పైనే ఉందన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా అక్టోబర్ 4న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అలాగే భవిష్యత్తులోపార్టీలో మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట వెయ్యను ఉందని, కాంగ్రెస్లో రాబోయే రోజుల్లో మహిళా నేతలే మహారాణులని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి నేనని బిఆర్ఎస్ పార్టీ ముగిసిన అధ్యాయం లాంటిదని అన్నారు. అలాగే 51 సంవత్సరాల పాటురాజకీయాల్లో ప్రజలకు సుదీర్ఘ సేవలందించిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్బీన్ హంధాన్ నుఘనంగా సన్మానించారు.ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్వినయ్ రెడ్డి,బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్ రెడ్డి,పిసిసి కార్యదర్శి గడుగు గంగాధర్,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుమానాల మోహన్ రెడ్డి,బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాసుల బాలరాజ్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవ వేణు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, ముప్పా గంగారెడ్డితదితరులు పాల్గొన్నారు.
