. . . పట్టించుకోని అధికారులు
కామారెడ్డి, బతుకమ్మ :
మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో అక్రమంగా మొరం తవ్వకాలు, తరలింపు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండానే మొరం తవ్వకాలు చేపట్టి, వాహనాల ద్వారా తరలిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మొరం తవ్వకాల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడంతో పాటు, గ్రామ పరిసరాల్లో పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ మొరం తవ్వకాలు, తరలింపును అరికట్టడంతో పాటు, అనుమతులు లేకుండా ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
