23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రభుత్వ భూమి అక్రమంగా కబ్జా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆర్డిఓ, తహసీల్దార్ కు గ్రామస్థుల ఫిర్యాదు

 

మహమ్మద్ నగర్, బతుకమ్మ :

 

ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు భూమిని కబ్జా చేసుకునేందుకు కన్నేస్తున్నారు. ప్రభుత్వ భూములు అక్రమంగా కబ్జాకు గురవుతున్న రెవిన్యూ అధికారులు తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మహమ్మద్ నగర్ మండలం హసన్ పల్లిలో ఓడ్డే నర్సయ్య సర్వేనెంబర్ 70/1 ఇ లో ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జాకు పాల్పడినట్లు ఇటీవల ప్రజావాణిలో గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తహసిల్దార్ హసన్ పల్లిలో గ్రామ పాలన అధికారి, మండల సర్వేయర్, మండల గిర్దావార్ మోకాపై వచ్చి పరిశీలించి, విచారణ చేయగా సర్వేనెం. 70/ఇ లో సూమరుగా మూడు ఎకరాల పైగా అక్రమ భూమిని కబ్జా చేశాడని విచారణలో బయటపడింది. అక్రమంగా కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమిలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే కొంతమంది అధికారులు అండదండలు ఉండడంతో పెద్ద ఎత్తున వారికి కాసులు గుమ్మరించి లక్షల విలువ చేసే భూములను కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇదే వ్యక్తి ఇటీవల ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతి లేకుండా మొరంను జెసిబి తో తీస్తుండగా రెవిన్యూ శాఖ అధికారులు పట్టుకొని జరిమానా విధించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి అక్రమంగా కబ్జా చేస్తున్న భూమిని స్వాధీనం చేసుకొని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు రెవిన్యూ శాఖ అధికారులను కోరుతున్నారు.

 

Illegal occupation of government land

More articles

Latest article