29 C
Hyderabad
Monday, August 3, 2026

అక్రమంగా నరికిన కలప పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని జానకంపల్లి కుర్దు గ్రామనికి చెందిన కుర్మా నారాయణ కు చెందిన పొలం లో అక్రమంగా నరికిన  టేకు కలపను గురువారం స్వాధీనం చేసుకున్నట్లు  డీఆర్ఓ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేయగా కురుమ నారాయణ పొలంలో  గడ్డి కింద కప్పి ఉంచిన టేకు దుంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ టేకు దుంగల విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని అన్నారు. ఎవరైనా ఫారెస్ట్ లో టేకు దొంగలు నరికిన, పొలాలలో టేకు చెట్లు పెట్టిన వారు ఫారెస్ట్ అధికారులు అనుమతులు తీసుకొని వాటికి డీడి కట్టి టేకు చెట్లను తొలగించాలని పంట పొలాల్లో ఉన్న రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీట్ అధికారి శేఖర్ రెడ్డి, రాజ్ కుమార్,  బేస్ క్యాంప్ సిబ్బంది హరి నాయక్ పాల్గొన్నారు.

Illegal logging

More articles

Latest article