27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రైతులపై అక్రమ కేసులా..?

Must read

📰 Generate e-Paper Clip

  • విధులలో లేని వ్యక్తి ఫిర్యాదు చేస్తే కేసులపై రైతుల మండిపాటు
  • ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నది ఎవరు?

 

కోటగిరి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కోటగిరి పోలీస్ స్టేషన్ ఇటీవల రైతులపై కేసు నమోదు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం అనుమతించిన చోట ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఇసుకను తవ్వకుండా బహిరంగంగా విక్రయించుందకు ఇతర ప్రాంతాల్లో తవ్వడంపై స్థానిక రైతులు తప్పుపట్టారు. ఇటీవల పోతంగల్ మండల కేంద్రంలో  ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. అక్కడికి వచ్చిన అధికారులను నిలదీశారు. అయితే తమ విధులకు ఆటంకం కలిగించారని రెవెన్యూ ఇన్స్ పెక్టర్ విధులను అడ్డుకున్నారనే ఫిర్యాదుపై 12 మంది రైతులపై కేసులు నమోదయ్యాయి. దానిని రైతులు తీవ్రంగా ఖండించారు. గురువారం పోతంగల్ మండల కేంద్రంలో రైతులు విలేకరులతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు అక్రమ ఇసుకపై ఉక్కుపాదం చేసి రాస్తారోకో చేయడం వలనఈ విషయంపై స్పందించిన ఎమ్మార్వో గంగాధర్ కామ్లే, బోధన్ ఎసిపి ,కోటగిరి ఎస్సై సునీల్ తో పాటుమైనింగ్ శాఖ సిబ్బంది వచ్చి విచారణ చేయడం జరిగిందన్నారు. ఈ విషయంలో అధికారులు ఓ ప్రైవేట్ వ్యక్తి తన భూమి అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ కు  అప్లికేషన్ పెట్టుకోవడంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం పర్మిషన్ ఇవ్వడం జరిగిందని, అక్రమ ఇసుక రవాణా జరగలేదని అధికారులు తెలిపారన్నారు.

  • అనుమతులు ఇచ్చిన భూముల్లో కాకుండా సర్వే నంబర్ 334 ప్రభుత్వ భూమిలో తవ్వకాలు..

కొడిచర్ల గ్రామంలోని ఓ రైతు తనకున్న నాలుగు ఎకరాల భూమిని అభివృద్ధి చేసుకుంటా అంటూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేయడంతో అధికారులు ఆయనకు అనుమతులు ఇచ్చారు. సుమారు 20 రోజులు టిప్పర్ల ద్వారా ఇసుక ఇందిర ఇండ్ల కోసం పోయింది. అయితే ఇక్కడున్న కొంతమంది కాంట్రాక్టర్లు మాత్రం పక్కనే 334 సర్వే నంబర్లు సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇసుకను త్రవ్వకాలు చేసి ర్యాంపులు వేస్తూ ఇసుక అనుమతులు తీసుకున్న రైతు పొలంలో డంపులు వేసి, రైతు పొలంలో నుంచి తరలిస్తున్నామంటూ అధికారులకు ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని గ్రామస్తులు గ్రహించికోపాధితులైన గ్రామస్తులు రాస్తారోకో చేశారు. సుమారు 12 మందితో పాటు గ్రామస్తులు ప్రభుత్వ సంపదను కాపాడుకోవడం కోసం వాల్టా చట్టాన్ని కాపాడడంలో భాగంగా అక్రమ ఇసుక జరుగుతుందని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేయడం జరిగిందని కొంతమంది పేర్కొంటున్నారు. గ్రామస్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే సుమారు 12 మంది మీద అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • 12 మందిపై ఏ విధంగా కేసులు నమోదు చేస్తారు..

ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పించి ప్రభుత్వ అధికారులపై నిరాదన ఆరోపణలు చేశారు అని ఒక సిబ్బందిపై మాటల యుద్ధంతో విధులకు ఆటంకం కల్పించారు అంటూరెవెన్యూ సిబ్బంది అయినా ముజాహిత్  కోటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుఈ ఫిర్యాదు ద్వారా సుమారు 12మందిపై ఎఫ్ఆర్ఐ అయినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఎస్సై సునీల్ కు ఫోన్ ద్వారా వివరణ కోరగా ఫిర్యాదు ఎవరైతే ఇచ్చారో దాని ఆధారంగా 12మందిపై ఎఫ్ఐ ఆర్ చేశామని సమాధానం ఇచ్చారు.  ఈ విషయం బోధన్ సబ్ కలెక్టర్కు కూడా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది ఈ విషయంలో విచారణ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ గంగాధర్ కు వివరణ కోరగా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పించడం వల్ల ఫిర్యాదు చేయడం జరిగింది అని సమాధానం ఇచ్చారు . ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో ముజాహిద్ కు ఫోన్ ద్వారా వివరణ కోరగాపోతంగల్ మండల కేంద్రంలో రాస్తారోకో  జరిగిన ప్రదేశంలో తాను లేననిపై అధికారుల ఆదేశానుసారం ఫిర్యాదు చేసిన అని ఈ విషయంలో తనకు ఏమీ తెలియదని సమాధానం సమాదానం చెప్పడంపై అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు.

Illegal cases against farmers..?

More articles

Latest article