ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఓ తండ్రి నిర్లక్ష్యం తన కొడుకు ప్రాణాన్ని బలితీసుకుంది. లింగంపేట్ మండంలోని బోనాల్ లో చెరువు ముందటి తండాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన రమావత్ భాస్కర్ కు ఇద్దరు సంతానం. ఒక కొడుకు, ఒక కూతరు. రమావత్ తన ట్రాక్టర్ తో పని ముగించుకుని వచ్చి ఇంటి సమీపంలో గేర్ వేసి నిలిపి పని నిమిత్తం కామారెడ్డి వెళ్లాడు. తన కుమారుడు రిషికేష్(6) ఆడుకుంటూ ట్రాక్టర్ పైకి ఎక్కి గేర్లు మార్చాడు. అది పల్లపు ప్రదేశం కావడంతో ట్రాక్టర్ ముందుకు వెళ్లి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ట్రాక్టర్ పై ఉన్న రిషికేష్ పై ట్రాక్టర్ ట్రాలీ పడడంతో బాలుడు అక్కడిక్కడే మరణించాడు.

