. . . కరుణ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్దులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ
మోర్తాడ్, బతుకమ్మ :
ప్రతి విద్యార్థి ఇష్టపడి చదివితే జీవితంలో విజయం సాధించడం చాలా సులువు అని ట్రస్ట్ చైర్మన్ మహేష్ కుమార్ అన్నారు. విద్యార్థులు ప్రారంభం నుంచే జీవితంలో ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం చదువుతూ లక్ష్యం వైపు అడుగులు వేసినప్పుడు అనుకున్న లక్ష్యం సాధించడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులకు శుక్రవారం కరుణ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్, పెన్నులు, పెన్సిల్లను అందించారు. అనంతరం పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వేణు గోపాల్ రావు, ఉపాధ్యాయ బృందం మహేష్ కుమార్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అరే అశోక్, పాఠశాల ఉపాధ్యాయులు చంద్రశేఖర్, నరసింహా స్వామి, రాజేందర్, త్రివేణి, రాజేశ్వరి, నచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

