29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

విజ్ఞానార్జనలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించండి

Must read

📰 Generate e-Paper Clip

  • ఇంటర్ విద్యా ప్రత్యేక అధికారి ఒడ్డెన్న

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో విద్యార్థిని, విద్యార్థులు తరగతులకు హాజరైనప్పటికీ పాఠాలను విని విజ్ఞానాన్ని సంపాదించడంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులను నిర్వహించాలని రాష్ట్ర ఇంటర్ బోర్డు  నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డెన్న అధ్యాపకులను ఆదేశించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాలోని వర్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల,  బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, మధుమలాంచ జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. ఆయా కళాశాలలో తరగతి గదులను సందర్శించి విద్యార్థుల విద్యాభ్యాసం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందితో సమావేశం అయ్యారు. ఈ సమావేశాలలో జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ కూడా పాల్గొన్నారు.  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి విద్యార్థిని లను విద్యావంతులుగా తీర్చే దిద్దే బాధ్యత అధ్యాపకులపైనే ఉందని జిల్లా ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డెన్న అన్నారు. ప్రతి అధ్యాపకుడు వృత్తి నిబద్దతతో పనిచేస్తూ వృత్తి ధర్మాన్ని నెరవేర్చాలని ఆదేశించారు. అధ్యాపకులుగా  వచ్చిన అవకాశాన్ని పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు చెందిన  వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధ్యాపకులపైనే ఉందని అన్నారు. ఇంటర్ విద్యార్థులకు  నవంబర్  నెలలో సిలబస్ పూర్తి చేసి ప్రాక్టికల్స్ కు  సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ లను ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలలో మరమ్మత్తుల కోసం ఇంటర్ విద్యా బోర్డు కేటాయించిన నిధులను వినియోగించుకొని సివిల్, ఎలక్ట్రికల్, ఫర్నిచర్ ఇతర అన్ని మరమ్మతులు పూర్తి చేయాలని  ప్రత్యేక అధికారి ఆదేశించారు. అలాగే ప్రయోగశాలలకు కేటాయించిన నిధులను వినియోగించుకొని వెంటనే ప్రాక్టికల్స్ కు అవసరమైన మెటీరియల్ ఇతర సామాగ్రిని సమకూర్చుకోవాలని జిల్లా ఇంటర్ విద్య ప్రత్యేక అధికారి ఆదేశించారు. ఇంటర్ బోర్డ్ కేటాయించిన నిధులను వినియోగించుకున్న తర్వాత సర్టిఫికెట్లను జిల్లా డీ.ఐ.ఈ.ఓ. కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ మాట్లాడుతూ ఇంకా విద్యార్థుల యుడైస్, అపార్ పనులు పూర్తికాని కళాశాలలో వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారా విద్యార్థుల అటెండెన్స్ కు పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరయ్యేట్టుగా ప్రిన్సిపాల్ లు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి ఆదేశించారు. హెచ్.ఆర్.ఎం.ఎస్. పోర్టల్ ద్వారానే అధ్యాపకులు సెలవు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అలాగే ఆన్లైన్ ద్వారానే టీచింగ్ డైరీ ను నమోదు చేయాలని ఆదేశించారు.  నవంబర్ మొదటి వారంలోనే ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు తేదీలను ప్రకటిస్తుందని కావున భవిష్యత్తులో విద్యార్థులను చదువుపై శ్రద్ధ వహించేలా ప్రిన్సిపాల్  లు అధ్యాపకులు కృషి చేయాలని అన్నారు.  గత సంవత్సరం నిర్వహించిన 90 రోజుల ప్రణాళికను ఈసారి కూడా అమలు చేసే అవకాశం ఉందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలియజేశారు. కళాశాలలలో ఫర్నిచర్  కూడా మరమ్మతులు చేయించి ఇంకా విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన డెస్క్ బెంచిలను సమకూర్చుకునేందుకు వెంటనే ప్రతిపాదనలను  పంపాలని అన్నారు. కళాశాలల సమావశాలలో  వర్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కల్పన, కోటగిరి కళాశాల ప్రిన్సిపాల్ కౌసర్ పాషా,  బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నిఖత్ కౌసర్, బోధన్ మధుమలాంచ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ జాఫర్, అన్ని కళాశాలల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Identify students who are lagging behind in academic achievement.

More articles

Latest article