విజ్ఞానార్జనలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించండి
ఇంటర్ విద్యా ప్రత్యేక అధికారి ఒడ్డెన్న నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో విద్యార్థిని, విద్యార్థులు తరగతులకు హాజరైనప్పటికీ పాఠాలను విని విజ్ఞానాన్ని సంపాదించడంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులను నిర్వహించాలని రాష్ట్ర ఇంటర్ బోర్డు నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డెన్న అధ్యాపకులను ఆదేశించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాలోని వర్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల, బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, మధుమలాంచ జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు....