బతుకమ్మ,ముప్కాల్: మండల కేంద్రంలో ప్రభుత్వ భూమిని గుర్తించి మంజూరైన ప్రభుత్వ ఆసుపత్రిని ఇక్కడే నిర్మించేలా కృషి చేయాలని ముప్కాల్ గ్రామపరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం రోజు ఉప శ్రీకాంత్ కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో గ్రామపరిరక్షణ సమితి కార్యదర్శి సంజీవ్ థామస్, సభ్యులు టి.సాయన్న, కట్ట మహేష్, గద్దల గంగారాం, జక్కుల రాము, కందుల శంకర్, కంచు గంగాధర్, బోట్ల భూమన్న, అనికేశి నడ్పి రాజన్న, రాకేష్, కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
