నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపందా ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన కామ్రేడ్ యాదగిరి అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయం ఎన్ఆర్ భవన్ కోటగల్లి వద్ద పార్టీ శ్రేణులు, వివిధ పార్టీ, ప్రజా సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కామ్రేడ్ కేజీ రామచంద్రరావు, కామ్రేడ్ కే.రమ మాట్లాడుతూ… సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) సీనియర్ నాయకుడు, 40 సంవత్సరాల పాటు రాష్ట్ర కమిటీ సభ్యులుగా, నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన కామ్రేడ్ కర్నాటి యాదగిరి మరణించడం పార్టీకే కాకుండా, పీడిత ప్రజలకు తీరని లోటన్నారు.

అత్యంత త్యాగపూరిత జీవితo ఆయనదన్నారు. 1969 లొ సాంఘిక సంక్షేమ శాఖ లో ఎల్ఢీసీ గా ఉద్యోగం చేస్తూ , కామ్రేడ్ డీవీ కృష్ణ , దాసు గార్ల స్పూర్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ బాధ్యతలను స్వీకరంచారన్నారు. అనేక నిర్భందాలను, ఎమర్జెన్సీ కాలంలో రహస్య జీవితాన్ని ఎదుర్కొన్నారన్నారు. కామ్రేడ్ యాదగిరి గారి కళ్ళను లయన్స్ క్లబ్ వారికి అందించడం, శరీరాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అప్పగించడం అత్యంత ఆదర్శనీయమన్నారు. కామ్రేడ్ కర్నాటి యాదగిరి కి సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంధా) రాష్ట్ర కమిటీ విప్లవజోహార్లు అర్పిస్తున్నదన్నారు. కామ్రేడ్ యాదగిరన్న కుటుంబ సభ్యులకు, సహచర కామ్రేడ్ లకు సంతాపాన్ని, సానుభూతిని తెలియచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కే.సూర్యం, వి.ప్రభాకర్, ఎం.హన్మేశ్, న్యూడెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీపీఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, ప్రొ. లింబాద్రి, డాక్టర్ లక్ష్మారెడ్డి, డాక్టర్ సూరి, నర్రా రామారావు, కోటపాటి నరసింహా నాయుడు, వేణుగోపాల్, కాకతీయ రజనీకాంత్, ఏఎస్ పోశెట్టి, భక్తవత్సలం, మీసాల సుధాకర్, మాస్ లైన్ పార్టీ ప్రజాసంఘాలు నరేందర్, రామకృష్ణ వెంకన్న, దేవరాం, రాజేశ్వర్, సుధాకర్, సాయన్న గంగన్న, ముత్తెన్న, మల్లేష్, సురేష్, కిషన్, మురళి, రమేష్, సత్తెక్క మరియు వివిధ పార్టీ, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

