27.3 C
Hyderabad
Friday, July 31, 2026

న్యాయవాదుల ప్రయోజనాలు తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు లేకుండా విధులు నిర్వహిస్తా

Must read

📰 Generate e-Paper Clip

 

.. . హైకోర్టు సీనియర్ న్యాయావాది పొన్నం అశోక్ గౌడ్

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

న్యాయవాదుల ప్రయోజనాలు తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు లేకుండా విధులు నిర్వహిస్తానని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయవాది, హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులను అభ్యర్థించ్చారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ కు జనవరి 30న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా గురువారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన న్యాయవాదులనుద్దేశించి ప్రసంగించారు.తనను సభ్యునిగా ఎన్నుకోవాలని ఆయన కోరారు. న్యాయవాదుల సంక్షేమం కోసం అమలు అవుతున్న ప్రగతి పథకాలకు మరింత వన్నె తెస్తానని ఆయన తెలిపారు.న్యాయవాదుల రక్షణ చట్టంకు రూపకల్పన జరుగుతోందని తెలిపారు. పోలీస్ స్టేషన్ లో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పోలీసు అధికారులు ఇస్తున్న బెయిల్ నిబంధనలు మార్చడానికి,ఆ అధికారాలు కోర్టులకే ఉండే విదంగా చట్ట సవరణ అవసముందని, ఆ దిశగా తన కార్యాచరణ ఉంటుందని ఆయన వివరించారు.ప్రస్తుతం అమలవుతున్న రెండు లక్షల భీమా సౌకర్యం సరిపోదని దానిని ఇంకా పెంచాల్సిన ఆవష్యకత ఉన్నదని అన్నారు. సీనియర్ నాయవాదిగా, హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగా న్యాయవాదుల సమస్యలపై అవగాహన ఉన్నదని మరింత అధ్యయనం చేసి మెరుగైన సంక్షేమ పథకాలకు కార్యరూపం కల్పిస్తానని ఆయన తెలిపారు. జనవరి 30 న తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ కు జరుగనున్న ఎన్నికలలో సభ్యునిగా గెలిపించాలని ఆయన న్యాయవాదులను కోరారు. బార్ అధ్యక్షుడు సాయరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమసాధనకు పాటుపడే అభ్యర్థి పొన్నం అశోక్ గౌడ్ అని కొనియాడారు. గౌడ్ గెలుపుకు కృషి చేద్దామని ఆయన న్యాయవాదులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు సురేష్, కోశాధికారి నారాయణ దాసు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్,న్యాయవాదులు నీలకంఠ రావు, బైర గణేష్, శ్రీరామ గౌడ్, కుమార్ దాసు, మారుతి,జక్కుల వెంకటేశ్వర్లు,పెండెం రాజు,తదితరులు పాల్గొన్నారు.

I will perform my duties without personal interests other than those of the lawyers

More articles

Latest article