30.9 C
Hyderabad
Monday, August 3, 2026

మాల సంఘం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా…

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కోట గల్లి మాల సంఘం అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని, వీలైనంత నిధులు ఇప్పిస్తానని నగర మేయర్ కూరగాయల ఉమారాణి స్పష్టం చేశారు. ఆదివారం కోటగల్లి మాల సంఘంలో మేయర్ దంపతులకు సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మాల సంఘం సభ్యుల్లో 60 శాతం నేను చిన్నప్పటి నుంచి చూసిన వారేనని అన్నారు. సంఘానికి అవసరమైన ఎస్టిమేషన్ తయారు చేయించుకొని తనకు ఇస్తే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తో మాట్లాడి అవసరమైన నిధులు కేటాయింపచేస్తానని తెలిపారు. తాను పదవి ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిలో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటగల్లి మాల సంఘం అధ్యక్షులు నల్ల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సక్కి సతీష్, కోశాధికారి చెక్క సాగర్, ఉప కోషాధికారి ప్రవీణ్, ముఖ్య సలహాదారులు సుంకరి లక్ష్మీనారాయణ, ప్రచార కార్యదర్శి కాదు సత్యనారాయణ, సీనియర్ నాయకులు సాధు నారాయణ, నల్ల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

 

I will do my best for the development of my community...

More articles

Latest article