29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

హైదరాబాద్ లో ‘హైడ్రా’ పోలీస్ స్టేషన్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణపై కఠినంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఏర్పాటు చేసి ఆక్రమణలను తొలగిస్తున్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ లో ప్రత్యేకంగా ‘హైడ్రా’ పోలీస్ స్టేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

కేవలం భూ కబ్జా కేసుల కోసమే ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ను గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రత్యేక పోలీస్ స్టేషన్ ప్రారంభంతో హైడ్రా మరింత బలోపేతం కానుంది. ఈ స్టేషన్ లో ఏసీపీ తిరుమల్ తోపాటు ఆరుగురు ఇన్ స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించనున్నారు.

More articles

Latest article