26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుని వద్ద గంజాయిని ఎక్సైజ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ పి. శ్రీధర్, కామారెడ్డి జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారి ముకుందరెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో సంబల్‌పూర్ నుండి పూణే వెళ్తున్న సాంగవళి ఎక్స్‌ప్రెస్ లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా వారి వద్ద సుమారు 10.9 కేజీల గంజాయి లభ్యమైంది. దీని విలువ సుమారు రూ. 5,50,000 ఉంటుందని అధికారులు తెలిపారు. పట్టుబడిన వారిలో అశోక్ కుమార్ మిశ్రా (మామిడిపల్లి మండలం, ఆర్మూర్), గణేష్ పండిత్ (పర్బని, మహారాష్ట్ర) ఉన్నట్లు గుర్తించారు. నిందితులు ఈ గంజాయిని రాయగఢ్-ఒరిస్సా నుండి నాందేడ్ తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సి.ఐ సంపత్ కృష్ణ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రైని, ఎస్.ఐ వి. అరుణ్ చంద్ర, బి. శ్రీనివాస్ రావు, ఆర్‌పీఎఫ్ ఎస్.ఐ, హెడ్ కానిస్టేబుల్, అహ్మద్, మునవర్, రాజు, పవన్, నర్సింలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article