28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

4.80 కోట్లు తిరిగి చెల్లించేదెలా?

Must read

📰 Generate e-Paper Clip

. . . తలలు పట్టుకుంటున్న తెయూ అధికారులు

. . . హైకోర్టు తీర్పు నేపథ్యంలో పోస్టుల కోసం వసూళ్ళపై చర్చ

. . . ఆనాటి నుంచి ఉన్న వారి మెడకు చుట్టుకుంటున్న వసూళ్ళ వ్యవహరం

నిజామాబాద్, బతుకమ్మ  :

తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2012లో ఇచ్చిన 3 విభాగాల పోస్టుల భర్తీ వ్యవహరం కోర్టు తీర్పు నేపథ్యంలో తెయూలో చర్చ మొదలైంది. ఆనాటి వీసీ ప్రొ.డా.అక్బర్ ఆలీఖాన్ హయంలో జరిగిన 13 మంది ప్రొఫెసర్లు,30 అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొత్తం 91 పోస్టుల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ అవకతవకలపై అక్టోబర్ 31న ఇచ్చిన తీర్పు యూనివర్సిటీ అధికారుల వసూళ్ల వ్యవహరం తెరపైకి వచ్చింది. ఆనాడు నిబంధనలకు విరుద్దంగా ఫార్మాసుటికల్ కెమిస్ట్రీ అప్లయిడ్ ఎకనామిక్స్ విభాగాల్లో ఆచార్యుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెల్సిందే. ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సును ప్రవేశపెడుతున్నామని నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు దాని రద్దు చేసినట్లు ప్రకటించి పోస్టులను భర్తీ చేశారు. పోస్టుల భర్తీ తర్వాత తిరిగి అదే కోర్సులను ప్రవేశపెట్టడంపై వెంకట్ నాయక్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో ఇటీవల రాష్ట్ర హైకోర్టు అందులో పోస్టులను రద్దు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే.

How to repay 4.80 crores?

తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటుతోనే అడుగుపెట్టిన అర్హతలు లేని ఒక ప్రొఫెసర్ ఆనాడు పోస్టుల భర్తీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వసూళ్ళ వ్యవహరానికి తెర లేపారు. ఆనాడు 91 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వగా దాదాపు ఆచార్య పోస్టుల కోసం దరఖాస్తు చేసిన వారి నుంచి రూ.4.80 కోట్లు వసూల్ చేసినట్లు తెలిసింది. ప్రొఫెసర్ క్యాడర్ కు ఒక రేటు, అసోసియేట్ ప్రొఫెసర్ ఒక రేటు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు మరో రేటు అన్న చందంగా వసూళ్ళ వ్యవహరం జరిగినట్లు తెలిసింది. తెలంగాణ విశ్వవిద్యాలయంలో అచార్యులు అన్నీ సామాజిక వర్గాల వారిని సమన్యాయాన్ని విస్మరించి కేవలం తన కులానికి చెందిన వారికే పోస్టులను అంటగట్టారన్న ఆరోపణలున్నాయి. అంతేగాకుండా ఈ వ్యవహరంలో లక్షల రూపాయలు వసూళ్ళు చేశారు. దాదాపు 4.80 కోట్ల రూపాయలను ఆచార్య పోస్టుల కోసం దరఖాస్తు చేసిన వారి నుంచి వసూల్ చేసినట్లు సమాచారం.

How to repay 4.80 crores?

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయంలో జరిగిన పోస్టుల భర్తీలో జీవో 420కి వ్యతిరేకంగా నియామకాలపై కోర్టు తీర్పు విరుద్దంగా రావడంతో ఆనాడు డబ్బులు ఇచ్చి పోస్టులు తెచ్చుకున్న వారు తమ పోస్టుల కోసం ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వాలని డిమాండ్ ను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆనాడు విశ్వవిద్యాలయంలో కీ రోల్ పోశించిన ఒక ప్రొఫెసర్, ప్రస్తుతం పని చేస్తున్న మరో ప్రొఫెసర్ ఈ వ్యవహరంలో ఉండడంతో అధికారులు సైలెంట్ అయ్యారు. కేవలం పదవులకు అంటకాగుతూ యూనివర్సిటీని అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా నిలిచిన వారిపై చర్యలు తీసుకుంటారా? డబ్బుల వసూళ్ళ వ్యవహరంపై విచారణ జరుగుతుందా అనే చర్చ మొదలైంది. ఉమ్మడి రాష్ట్రం మొదలుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను బహిరంగంగా అమ్ముకున్న ఘనచరిత్ర యూనివర్సిటీ అధికారులది. ప్రస్తుత ప్రభుత్వ హయంలోనైనా విచారణ జరిపి చర్యలు తీసుకుంటారా లేదా అనేది అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

More articles

Latest article