29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

త్వరలోనే ఇళ్ల పట్టాలు ఇప్పిస్తా 

Must read

📰 Generate e-Paper Clip

 ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

 బతుకమ్మ, పిట్లం :  పిట్లం మండల కేంద్రంలోని ఎల్లమ్మ కుచ్చ దగ్గర నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  పరిశీలించారు.గత ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు అని ప్రజలు ఎమ్మెల్యే  దృష్టికి తీసుకురాగా లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు నెల రోజుల్లో ఇప్పిస్తానని వారికి భరోసా ఇచ్చారు. మండల కేంద్రంలో ఖాళీగా ఉన్న స్థలాన్ని పరిశీలించి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులుపాల్గొన్నారు.

More articles

Latest article